Cyber Attacks | వారం రోజుల క్రితం జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన తర్వాత భారత్‌లో సైబర్ దాడులు (Cyber Attacks) భారీగా పెరిగినట్లు తాజాగా వెల్లడైంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల డిజిటల్ దాడులు జరిగినట్లు (10 Lakh Cyber Attacks Targeting India) తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ విభాగం (Maharashtra Cyber Department) తాజాగా వెల్లడించింది. ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల హస్తం ఉన్నట్లు తెలిపింది.
ఏప్రిల్ 22న పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్‌లో డిజిటల్ దాడులు పెరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తెలిపింది. భారత్‌లోని వివిధ వెబ్సైట్లు, అధికారిక పోర్టళ్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ దాడులు పాకిస్థాన్, మిడిల్ ఈస్ట్, ఇండోనేషియా, మొరాకో దేశాల నుంచి జరిగినట్లు వెల్లడించింది. చాలా హ్యాకింగ్ గ్రూపులు తమను తాము ఇస్లామిక్ గ్రూపులుగా చెప్పుకుంటున్నాయని.. ఇది బహుశా సైబర్ వార్ కావొచ్చని మహారాష్ట్ర సైబర్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ తెలిపారు.
Also Read..
JD Vance | ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలి.. పాక్‌కు జేడీ వాన్స్ సూచన
Pak Army | సరిహద్దుల్లో ఉద్రిక్తత.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు
CIA | భారత్ అంటే పాక్‌కు భయమే.. యుద్ధం చేసే దమ్ము ఆ దేశానికి లేదు: సీఐఏ