Siddaramaiah | తనకు కూడా బెదిరింపు కాల్స్ (threat calls) వస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. స్పీకర్ యుటి ఖాదర్‌కు బెదిరింపు కాల్ వచ్చిందంటూ విలేకరుల ప్రశ్నకు సీఎం ఈ విధంగా స్పందించారు.
‘అవును.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలి..? పోలీసులకు సమాచారం ఇచ్చాము. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని కనుగొని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాము’ అని సీఎం సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. అంతేకాదు, మంగళూరులో జరిగిన రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య ఘటన నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
మంగళూరు (Mangaluru)లో రౌడీ షీటర్ సుహాస్ శెట్టి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో నడిరోడ్డుపై నరికి చంపేశారు. ఈ ఘటనతో మంగళూరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, నినాదాలు చేయడం, ఆయుధాలను పట్టుకెళ్లడాన్ని నిషేధించారు. సుహాస్‌ను పథకం ప్రకారమే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే ఆ మర్డర్ వెనుక ఉన్న కారణం ఇంకా తెలియరాలేదు.
Also Read..
National Herald case | సోనియా, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు
Ghibli | శామ్ ఆల్ట్‌మన్, సత్య నాదెళ్ల జిబ్లీ ఫొటో చూశారా.. వైరలవుతున్న పిక్
Terror Attack | పెహల్గామ్ దాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం.. ఎన్ఐఏ వర్గాల సమాచారం