న్యూఢిల్లీ: మొదటి భార్య, ఆమె పిల్లలు కలిసి భర్త రెండో భార్యను హత్య చేశారు. (Woman, Sons Kill Husband’s Second Wife) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జామియా నగర్‌కు చెందిన అన్సార్ ఖాన్‌కు అఫస్రీ, నస్బు అనే ఇద్దరు భార్యలున్నారు. అఫస్రీకి 14, 13, ఆరేళ్ల వయస్సున్న ముగ్గురు కుమారులు ఉన్నారు.
కాగా, అన్సార్ ఖాన్ సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. దీంతో అతడి ఇద్దరు భార్యలు జామియా నగర్‌లోని ఒకే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. అన్సార్ ఖాన్ రెండో భార్య అయిన 40 ఏళ్ల నస్బు రక్తం మడుగుల్లో మరణించడాన్ని గమనించారు. ఆమె శరీరంపై కత్తి గాయాలు ఉండటాన్ని పరిశీలించారు.
మరోవైపు ఆ ఇంట్లోకి ఎవరూ బలవంతంగా చొరబడలేదని పోలీసులు గ్రహించారు. దీంతో అఫస్రీని ప్రశ్నించగా తన పిల్లలతో కలిసి నస్బును హత్య చేసినట్లు ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఇంట్లో గొడవలు, వ్యక్తిగత అభద్రత వల్ల ఇలా చేసినట్లు చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో అఫస్రీని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read: