రాంచీ: ఇండిగో విమానాన్ని (IndiGo flight) పక్షి ఢీకొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం బీహార్ రాజధాని పాట్నా నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి ఇండిగో విమానం బయలుదేరింది. అయితే రాంచీ సమీపంలో గాలిలో ఎగురుతున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. సుమారు 3,000 నుంచి 4,000 అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
కాగా, పక్షి ఢీకొట్టిన ఇండిగో విమానాన్ని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఆ విమానంలోని 175 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. పక్షి ఢీనడం వల్ల విమానానికి జరిగిన డ్యామేజ్ను ఇంజినీర్లు అంచనా వేస్తున్నారని అన్నారు.
మరోవైపు ఆదివారం ఢిల్లీ చేరుకున్న ఇండిగో విమానం తీవ్ర వాతావరణం కారణంగా అల్లకల్లోలానికి గురైంది. దీంతో కొంతసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అయ్యింది.
Also Read: