భోపాల్: గుర్రం, ఏనుగు మధ్య ఫైట్ జరిగింది. గుర్రం దూకుడుగా ఏనుగుపైకి దాడి చేసింది. (Elephant, Horse Fight) అయితే బెదిరిన ఏనుగు ప్రతిఘటించకపోగా అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని రత్లాంలో ఈ సంఘటన జరిగింది. పాల్సోడా ఫాటా సమీపంలో ఒకచోట తెల్ల గుర్రాన్ని కట్టి ఉంచారు. అయితే పెద్ద ఏనుగు అంబారీపై ఒక వ్యక్తి కూర్చొన్నాడు. దగ్గరకు వచ్చిన ఆ ఏనుగును చూసి గుర్రం తాడు తెంపుకున్నది. దూకుడుగా ఏనుగుపైకి దాడి చేసింది. ఏనుగుపై కూర్చొన్న వ్యక్తి కర్రతో గుర్రాన్ని తరిమేందుకు ప్రయత్నించాడు.
కాగా, చాలా పెద్దగా ఉన్న ఏనుగు, చిన్నదైన గుర్రం దాడిని ప్రతిఘటించలేకపోయింది. పైగా అక్కడి నుంచి దూరంగా అది పరుగెత్తింది. అక్కడున్న జనం గుర్రాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ గుర్రం దూకుడుగా ఏనుగును వెంబడించింది. ఒకరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
हाथी और घोड़े का युद्ध भी देख लो 😄 pic.twitter.com/Amwbl5TkP5
— CRICKET LOVER 🙃 (@Cricket_lover2o) May 31, 2025
Also Read: