Viral Video | ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైక్‌ను ఎస్యూవీ కారు బలంగా ఢీ కొట్టింది (SUV collided with a motorcycle). ఈ ఘటనలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గోరఖ్‌పూర్-వారణాసి జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది.
నలుగురు యువకులు ఒక బైక్‌పై వెళ్తున్నారు. వారు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టెక్ చేస్తుండగా.. అదే సమయంలో ఎదురుగా ఎస్యూవీ కారు వచ్చి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
4 youths including three cousins riding on a bike died after hit by a Grand Vitara car on Gorakhpur Varanasi Highway in Barhalganj, Gorakhpur.
3 of them got thrown 20 feet up after the collision and fell down while 1got stuck on the bonnet of the car @Uppolice @myogiadityanath pic.twitter.com/sGCGZDlXuJ— Shreepad Gokhale (@SriVallabh5453) June 1, 2025
Also Read..
Reptiles Seized: విమానాశ్రయంలో అరుదైన పాములు సీజ్.. థాయ్ నుంచి సరీసృపాలు స్మగ్లింగ్
Sikkim | మిలిటరీ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
Bihar Elections | మూడు దశల్లో బీహార్ ఎన్నికలు..?