Sikkim | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఘోర ప్రమాదం సంభవించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఉత్తర సిక్కింలోని ఛతేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్‌పై (military camp in Sikkim) కొండచరిలు (landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కనీసం ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు.
రక్షణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గరు ప్రాణాలు (security personnel) కోల్పోగా.. ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద స్థలి నుంచి ముగ్గురి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆచూకీ గల్లంతైన వారికోసం సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని రక్షణశాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సిక్కిం, అస్సాం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నారు. కొన్ని చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read..
Bihar Elections | మూడు దశల్లో బీహార్ ఎన్నికలు..?
Anna University | అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు.. దోషికి 30 ఏళ్ల జైలు శిక్ష
Telangana Statehood Day | తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని