బెంగళూరు: ఏడుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని వెంబడించారు. బేకరీ షాపులోకి పరుగెత్తిన అతడిపై అక్కడ దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. (Man Murdered Inside Bakery) ఆ బేకరీ షాపులో ఉన్న వారు ఇది చూసి భయాందోళన చెందారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తవరగేర పట్టణంలో నివసించే చెన్నప్ప హుసేనప్ప నరినాల్ రోజువారీ కూలీ. మే 31న శనివారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద కత్తులు చేతపట్టిన కొందరు వ్యక్తులు అతడ్ని వెంబడించారు.
కాగా, ఒంటిపై చొక్కాలేని చెన్నప్ప భయంతో ఒక బేకరీ షాపులోకి పరుగెత్తాడు. ఆ వ్యక్తులు కూడా అతడ్ని అనుసరించారు. చెన్నప్పను వెంబడించి బేకరీ షాపులో దాడి చేశారు. పొడవైన కత్తులతో అతడ్ని నరికారు. బేకరీ షాపు బయటకు పరుగెత్తిన చెన్నప్ప అక్కడ కుప్పకూలి మరణించాడు. కత్తులతో దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చెన్నప్ప హత్యకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను రవి, ప్రదీప్, ఇద్దరు మంజునాథ్లు, నాగరాజ్, గౌతమ్, ప్రమోద్గా గుర్తించారు. పాత శత్రుత్వం, ఆస్తి వివాదం ఈ హత్యకు కారణమని పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, బేకరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ಬೇಕರಿಗೆ ನುಗ್ಗಿ ಲಾಂಗ್ ಮಚ್ಚುಗಳಿಂದ ಭೀಕರ ದಾಳಿ | Koppala Crime | attack in Bakery
.
.
.
.
.#koppla #CrimeNews #rowdy #bakery pic.twitter.com/Z6JXDKh5gW— Sanjevani News (@sanjevaniNews) June 2, 2025
Also Read: