న్యూఢిల్లీ: పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ కార్యాలయానికి కన్నం వేశాడు. స్పెషల్ సెల్ నుంచి రూ.51 లక్షల నగదు, నగలను చోరీ చేశాడు. (Constable Steals Cash, Jewellery) ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఖుర్షీద్ గతంలో మల్ఖానాలోని పోలీస్ స్పెషల్ సెల్లో పని చేశాడు. కొన్ని రోజుల కిందట తూర్పు ఢిల్లీకి అతడు బదిలీ అయ్యాడు.
కాగా, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఖుర్షీద్ ఏకంగా పోలీస్ కార్యాలయానికి కన్నం వేశాడు. మే 30న రాత్రి వేళ మల్ఖానాలోని పోలీస్ స్పెషల్ సెల్‌కు వచ్చాడు. అందులో ఉన్న రూ.51 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు మల్ఖానా ఇన్ఛార్జ్ కొద్దిసేపటికే ఈ విషయాన్ని గ్రహించాడు. స్పెషల్ సెల్ నుంచి డబ్బు, నగలు మాయంపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఖుర్షీద్‌ను నిందితుడిగా గుర్తించారు. దీంతో స్పెషల్ సెల్ పోలీసులు ఖుర్షీద్‌ను శనివారం అరెస్ట్ చేశారు.
Also Read: