పాట్నా: అత్యాచార బాధితురాలిని గంటలపాటు అంబులెన్స్‌లో ఆసుపత్రి బయట వేయి ఉంచారు. ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించింది. (victim Left waiting in ambulance) దీంతో ఆసుపత్రి నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. మే 26న ముజఫర్‌పూర్ జిల్లాలోని గ్రామానికి చెందిన పదేళ్ల దళిత బాలికకు చాకెట్లు ఇచ్చి ఒక యువకుడు ఆకట్టుకున్నాడు. సమీపంలోని పొలం వద్దకు ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు.
కాగా, తీవ్రంగా గాయపడిన ఆ బాలికను తొలుత ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
మరోవైపు ఆ ఆసుపత్రికి చేరుకున్న అత్యాచార బాధితురాలిని పలు గంటలపాటు అంబులెన్స్‌లోనే వేయి ఉంచారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో సకాలయంలో వైద్య చికిత్స అందకపోవడంతో ఆదివారం ఆమె మరణించిందని తెలిపారు. స్థానిక పోలీసులు తొలుత స్పందించకపోవడంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కాగా, ఈ సంఘటనపై పాట్నాలో భారీ నిరసనలు చెలరేగాయి. కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. సీఎం నితీశ్ కుమార్, ఆరోగ్య మంత్రి మంగళ్ పాండేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read: