Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur stampede) తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Actor Vijay) మరో ర్యాలీకి సిద్ధమయ్యారు. ఇటీవలే పుదుచ్చేరిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన విజయ్.. ఈసారి తమిళనాడు (Tamil Nadu)లోని ఈరోడ్‌లో ప్రచార ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ ర్యాలీకి ఈరోడ్ (Erode) పోలీసులు తాజాగా పర్మిషన్ ఇచ్చారు.
ఈనెల 18న ఈరోడ్‌లోని విజయపురిలో విజయ్ తన తదుపరి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ర్యాలీ జరగనుంది. దాదాపు 16 ఎకరాల ప్రైవేట్ ఆలయానికి సంబంధించిన ల్యాండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు సంబంధించి 84 కండిషన్స్ (84 conditions) పెట్టారు. నిర్వాహకులు రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని కోరారు. అంతేకాదు కార్యక్రమం అనంతరం వేదికను శుభ్రం చేసి.. తిరిగి నీట్‌గా అప్పగించాలని పేర్కొన్నారు. ఇక ర్యాలీకి అనుమతించడంతో టీవీకే ఏర్పాట్లను మొదలు పెట్టింది.
Also Read..
Dense Smog | పొగమంచు ఎఫెక్ట్.. ఢీ కొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి
Sabarimala | శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తులు.. 25 లక్షలు దాటిన సంఖ్య