Dense Smog | ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు (Dense Smog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai Delhi Expressway)పై ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండటంతో దాదాపు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకూ గాయపడ్డారు.
సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత రెండు ఓవర్‌లోడ్ డంపర్ ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత వెంటనే వెనుక నుంచి వస్తున్న పలు ట్రక్కులు, కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రమాదం కారణంగా దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అంతేకాదు, పొగమంచు కురుస్తున్న సమయంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కుపైగా విమానాలు రద్దు
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన, రైలు రాకపోకలపై ప్రభావం