Sabarimala | కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple)కు భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప దర్శనానికి కేరళ, తమిళనాడు సహా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్లో ఇప్పటి వరకూ 25 లక్షల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుత సీజన్లో ఆ సంఖ్య 25 లక్షలు దాటినట్లు శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఎడీజీపీ ఎస్ శ్రీజిత్ తెలిపారు. డిసెంబర్ చివరినాటికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
Also Read..
PM Modi | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ప్రధాని విదేశీ పర్యటనపై తీవ్ర ప్రభావం
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన, రైలు రాకపోకలపై ప్రభావం