Amit Shah | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ (TMC) ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అవినీతి, భయం, చొరబాట్లతో బెంగాల్ నిండిపోయిందని.. ఇది రాష్ట్ర భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు.
కోల్‌కతా (Kolkata)లో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ.. 15 ఏండ్ల తృణమూల్ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ‘గత 15 ఏండ్లుగా బెంగాల్ భయం, అవినీతి, దుష్పరిపాలనను చూసింది. చొరబాట్లు ప్రజల్లో అభద్రతా భావాన్ని, ఆందోళనను సృష్టించాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది’ అని షా వ్యాఖ్యానించారు.
దీదీ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంగాల్‌కు తిరిగి పూర్వవైభవం తెస్తామని.. స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటోపాధ్యాయ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఊహించిన బెంగాల్‌ను నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read..
Air India Express Pilot: అటాక్ కేసులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ అరెస్టు, రిలీజ్
Multi Vehicle Collision | పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
Bus Falls Into Gorge | లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి