Bus Falls Into Gorge | ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అల్మోర్ (Almora) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది (Bus Falls Into Gorge). ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భికియాసేన్ (Bikhiyasain) సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బస్సు భికియాసేన్ నుంచి అల్మోరా జిల్లాలోని రామ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dhami) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read..
Priyanka Gandhi | ప్రియాంక గాంధీ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. స్నేహితురాలితో కుమారుడి ఎంగేజ్మెంట్
Air Pollution | ప్రమాదకరస్థాయిలోనే గాలి నాణ్యత.. పొగమంచుతో 118 విమానాలు ఆలస్యం
Tiger Attack: యువకుడికి పంచ్ ఇచ్చి.. ఇంట్లో మంచంపై కూర్చున్నది.. ఫారెస్ట్‌లో టైగర్ హల్చల్