Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా (Raihan Vadra) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
25 ఏళ్ల రైహాన్ వాద్రాకు అవీవాతో ఏడేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో అవివా బేగ్కు రేహాన్ ప్రపోజ్ చేయగా.. ఆమె ఓకే చెప్పినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిపించినట్లు టాక్. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అవీవా ఢిల్లీకి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది.
Also Read..
Air Pollution | ప్రమాదకరస్థాయిలోనే గాలి నాణ్యత.. పొగమంచుతో 118 విమానాలు ఆలస్యం