Air Pollution | ప్రమాదకరస్థాయిలోనే గాలి నాణ్యత.. పొగమంచుతో 118 విమానాలు ఆలస్యం
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. అతి సమీపంలో వెళ్లే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో రోడ్డు, రైలు, వాయు రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే వందకు పైగా విమానాలు రద్దయ్యాయి.
పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపు 118 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో 60 అరైవల్స్ కాగా, 58 డిపార్చర్స్ ఉన్నాయి. మరో 16 విమానాలను అధికారులు దారి మళ్లించారు. పొగ మంచు పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు విమాన స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచించింది. మరోవైపు విమానాల రద్దు, ప్రయాణ సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్సైట్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. మరోవైపు.. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (Air Quality Index) ప్రమాదకరస్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. ఇవాళ ఉదయం రాజధాని నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 384గా నమోదైంది. నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచిక 400 మార్క్‌ను దాటి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. వజీర్పూర్ (454), రోహిణి (453), ఆనంద్ విహార్ (450), అశోక్ విహార్ (437), పంజాబీ బాగ్ (429), సోనియా విహార్ (426), పట్పర్గంజ్ (413), సిరిఫోర్ట్ (408), షాదీపూర్ (401) అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
Also Read..
ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన బస్సు..నలుగురి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

