న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ముంబయి నగరంలో ఓ బస్సును రివర్స్ చేస్తుండగా అది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నగరంలోని భాందూప్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ‘బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్, ట్రాన్స్పోర్ట్’ (బెస్ట్)కు చెందిన ఓ బస్సును డ్రైవర్ వెనక్కి తీస్తుండగా హఠాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ టీమ్ వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని ఓ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడ్డవాళ్లను అంబులెన్స్‌లో సమీపంలోని దవాఖానకు తరలించినట్టు చెప్పారు.