ఉమరియా: మధ్యప్రదేశ్‌లో ఓ పులి హంగామా చేసింది. బందవ్‌ఘర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో సోమవారం ఉదయం స్థానిక యువకుడిపై అటాక్(Tiger Attack) చేసింది. ఒక్క పంచ్‌కే ఆ వ్యక్తి కుప్పకూలాడు. ఆ తర్వాత ఆ పులి సమీపంలోని ఇంటిలోకి వెళ్లి మంచంపై కూర్చున్నది. ఆ పులి భయానికి ఇంట్లో వాళ్లు పైకప్పు మీదికెక్కేశారు. టైగర్ అటాక్‌లో గోపాల్ కోల్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతని కాళ్లకు గాయాలు అయ్యాయి. కట్ని జిల్లాలోని బర్హి ఆస్పత్రిలో అతన్ని చేర్పించారు. గోపాల్‌పై దాడి చేసిన తర్వాత ఆ పులి దుర్గ ప్రసాద్ ద్వివేది ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంట్లో ఉన్న మంచంపై కూర్చున్నది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు.
ఉదయం 10 గంటల సమయంలో స్థానిక గ్రామ పొలాల్లో తొలుత పులిని గుర్తించారు. పానపత్త బఫర్ జోన్లో అది సంచరిస్తున్నట్లు గమనించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. అయితే మధ్యాహ్నం సమయానికి అది పొలాల నుంచి గ్రామంలోకి వెళ్లింది. వన్యమృగాలు తరుచుగా గ్రామంలో సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. కర్రలతో తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పులి గ్రామస్థుడిపై ఎదురుదాడి చేసింది. అప్పుడే గోపాల్‌పై అటాక్ జరిగింది.
స్పాట్‌కు వచ్చిన పానపత్త బఫర్ జోన్ అధికారులు సుమారు 8 గంటల తర్వాత పులికి మత్తు ఇచ్చారు. సాయంత్రం దాన్ని అదుపులోకి తీసుకున్నారు.
Jungle News: वीडियो बनाने वाले पर गुस्साए बाघ ने किया हमला फिर घर में घुसकर चारपाई पर सो गया ! MP Tak#viralvideo #MadhyaPradesh pic.twitter.com/DZeZtubJ6E
— MP Tak (@MPTakOfficial) December 30, 2025