Multi Vehicle Collision | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను దట్టమైన పొగకమ్మేసింది (Dense Fog). దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ పొగమంచు కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానా (Haryana)లో రోడ్డు ప్రమాదం జరిగింది.
తీవ్రమైన పొగమంచు పరిస్థితుల కారణంగా దృశ్యమానత పడిపోయింది. దీంతో అతిసమీపంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. ఈ కారణంగా సోనిపట్ జిల్లాలోని బహల్‌గఢ్ సమీపంలో ఢిల్లీ-సోనిపట్ రహదారిపై (Delhi-Sonipat Road) ఇవాళ ఉదయం పలు వాహనాలు ఢీ కొన్నాయి (Multi Vehicle Collision). ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు వాహనాలు ఢీ కొనడంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా రహదారిపై ఢీకొన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
కాగా, పొగమంచు కారణంగా గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో వాహనాలు ప్రమాదానికి గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పొగమంచు పరిస్థితుల కారణంగా విజిబిలిటీ సరిగా లేదని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Also Read..
Bus Falls Into Gorge | లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
Priyanka Gandhi | ప్రియాంక గాంధీ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. స్నేహితురాలితో కుమారుడి ఎంగేజ్మెంట్
Tiger Attack: యువకుడికి పంచ్ ఇచ్చి.. ఇంట్లో మంచంపై కూర్చున్నది.. ఫారెస్ట్‌లో టైగర్ హల్చల్