Why Electric Scooter Catches Fire | రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను చూసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోవడం బెటర్ అని మొన్నటిదాకా అనుకున్న జనం.. ఇప్పుడు వాటి పేరు ఎత్తడానికే భయపడిపోతున్నారు. ఈ -స్కూటర్లు బాంబుల్లా పేలిపోవడం చూసి జంకుతున్నారు. అసలే 2030 నాటికి 80 శాతం వాహనాలను ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో రీప్లేస్ చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇలాంటి నెగెటివిటీ రావడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి? అసలు సమస్య ఎక్కడ ఉందనే విషయాలను తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది. ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన వివిధ కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాల నుంచి శాంపిల్స్‌ను సేకరించిన ఈ కమిటీ వాటిపై దర్యాప్తు చేసింది. దీని ఆధారంగా కమిటీ ఒక ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
– ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదానికి గురికావడానికి ప్రధాన కారణం బ్యాటరీ సెల్స్, మ్యాడ్యుల్స్‌లో లోపాలు అతని ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనంలో ప్రాథమికంగా వెల్లడైంది.
– ఒకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదానికి బ్యాటరీ సెల్స్, మ్యాడ్యుల్స్ కారణమని పేర్కొంది.
– ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సంబంధించి బ్యాటరీ కేసింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
– అదే దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్లు కమిటీ అధ్యయనంలో వెల్లడైంది. కాగా.. ఐసోలేటెడ్ థర్మల్ ఇష్యూ కారణంగా ఓలా స్కూటర్లు అగ్ని ప్రమాదాల బారిన పడుతున్నాయని స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ఎలా వస్తున్నాయి? అగ్ని ప్రమాదానికి గురవ్వడానికి కారణమేంటనే అంశాలపై ఇప్పటివరకు ప్రాథమిక అంచనాకే వచ్చామని ఉన్నత స్థాయి కమిటీ తెలిపింది. ప్రమాదాలకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేదానిపై మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తుది నివేదిక వెలువడనుంది. తుది నివేదిక వెల్లడయ్యేందుకు కనీసం రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను తట్టుకోలేక పాత సైకిల్‌నే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేశాడు”