AMO Jaunty Plus | 4 గంటలు చార్జ్ చేస్తే చాలు.. 120 కిమీ మైలేజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర ఎంతంటే?
బెస్ట్ డిజైన్, బెస్ట్ పర్ఫార్మెన్స్తో పాటు పూర్తిగా అన్ని సేఫ్టీ పద్ధతులతో ఏఎంవో.. జాండీ ప్లస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్
AMO Jaunty Plus | ఎలక్ట్రిక్ బైక్స్ కంపెనీ ఏఎంవో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తాజాగా భారత మార్కెట్లోకి లాంచ్ అయింది. కేవలం 4 గంటలు చార్జ్ చేస్తే చాలు.. 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్‌ని ఈ స్కూటర్ ఇస్తుంది. కేవలం 4 గంటల్లోనే వంద శాతం చార్జింగ్ అవుతుంది. బెస్ట్ డిజైన్, బెస్ట్ పర్ఫార్మెన్స్తో పాటు పూర్తిగా అన్ని సేఫ్టీ పద్ధతులతో ఏఎంవో.. జాండీ ప్లస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,10,460 గా ఉంది. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించినట్టు ఏఎంవో ప్రకటించింది.

60 వాట్స్ / 40 ఏహెచ్ అడ్వాన్స్డ్ లిథియమ్ బ్యాటరీ, హై పర్ఫార్మెన్స్ మోటర్, క్రూజ్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్(ఈఏబీఎస్), యాంటీ థెఫ్ట్ అలారం, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డీఆర్ఎల్ లైట్స్, ఇంజిన్ కిల్ స్విచ్ లాంటి అధునాతనమైన ఫీచర్లతో ఈ బైక్‌ను ఏఎంవో భారత విపణిలోకి తీసుకొచ్చింది.
3 సంవత్సరాల వ్యారంటీతో ఈ బైక్‌ను సేల్స్‌లో ఉంచారు. రెడ్ బ్లాక్, గ్రే బ్లాక్, బ్లూ బ్లాక్, వైట్ బ్లాక్, ఎల్లో బ్లాక్ కలర్స్ వేరియంట్లతో ఈ బైక్‌ను లాంచ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న 140 డీలర్షిప్స్ ద్వారా 15 ఫిబ్రవరి 2022 నుంచి జాండీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మకాలు ప్రారంభం అవుతాయని ఏఎంవో ఎలక్ట్రిక్ బైక్స్ ఎండీ సుశాంత్ కుమార్ వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

