Jama Masjid | ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ (Sambhal)లో గల మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు (Shahi Jama Masjid)కు పెయింటింగ్ (Whitewashing) పనులు ప్రారంభమయ్యాయి. ఈ మసీదు బయటి గోడలకు రంగులు వేసేందుకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్మికులు రంగులు వేసే పనిని నేటి నుంచి ప్రారంభించారు.
#WATCH | UP | Sambhal: Whitewashing of Sambhal Jama Masjid begins after Allahabad High Court granted permission on March 12.
The next hearing in the case hearing is on April 8. pic.twitter.com/ZZZh0aBmAF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 16, 2025
షాహి జామా మసీదు అంశం ఇటీవలే వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గతంలో అక్కడున్న ఆలయాన్ని కూల్చి ఆ మసీదును నిర్మించినట్లు ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీని గురించి సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. దీంతో గతేడాది నవంబర్ 24న సర్వే కోసం వెళ్లిన బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు బాష్పాయువు ప్రయోగించారు. ఈ హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించగా పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు.
#WATCH | UP | Sambhal: Whitewashing of Sambhal Jama Masjid begins after Allahabad High Court granted permission on March 12.
The next hearing in the case hearing is on April 8. https://t.co/oVh6tsWum1 pic.twitter.com/UGxMwBbK3U
— ANI (@ANI) March 16, 2025
అయితే, ప్రస్తుతం రంజాన్ సందర్భంగా ఈ మసీదుకు పెయింటింగ్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని జామా మసీదు కమిటీ ఇటీవలే అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈనెల 12న విచారణ జరిపిన కోర్టు వారంలోపు పనిని పూర్తి చేయాలని ఆదేశించింది. మసీదు బయటి గోడలకు రంగులు వేసుకునేందుకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో ఎటువంటి చారిత్రక నిర్మాణం దెబ్బతినకూడదని, నిర్మాణాన్ని ప్రభావితం చేయకుండా పని చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కార్మికులు నేటి నుంచి పెయింటింగ్ పనులు షురూ చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మళ్లీ అక్కడ ఘర్షణ చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Also Read..
Terrorist | లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం
Amit Shah | వందేమాతరాన్ని ఆలపించిన ఏడేళ్ల చిన్నారి.. గిటార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన అమిత్ షా
Padma Awards | పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం