Padma Awards | వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘పద్మ’ అవార్డ్స్ (Padma Awards) కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను (nominations) ఆహ్వానించింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31 లోగా పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.inలో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలోని రెండు అత్యున్నత పౌరపురస్కారాలైన భారతరత్న, పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్ల ప్రతిష్ఠాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుండగా.. మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.
Also Read..
వారాంతంలో ఆపరేషన్లు చేసుకుంటే అధిక ముప్పు!