న్యూఢిల్లీ, మార్చి 15: డూప్లికేట్ తాళం చెవి తయారు చేయించుకోవాలంటే ఎంత ప్రయాస పడాలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే డూప్లికేట్ తాళం చెవిని క్షణాల్లో తయారు చేసే ఓ మెషీన్ గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఓ వీడియో నెటిజన్లను షాక్కు గురిచేయడమే కాదు ఔరా అనిపిస్తోంది.
ఏటీఎం లా ఉన్న వెండింగ్ మెషీన్ వీడియోని అమెరికాలో నివసించే తన్వీర్ షేక్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఎటువంటి తాళం చెవినైనా చిటికెలో తయారుచేయడం ఈ మెషీన్ ప్రత్యేకత. ఇంటి తాళం చెవులతోపాటు, వాహనాలు, బీరువాల కీస్, యాక్సెస్ కార్డులను కూడా తయారు చేయగలదు ఈ వెండింగ్ మెషీన్. ప్రత్యేకంగా తాళం చెవులను తయారుచేసే విధంగా ఈ మెషీన్ను డిజైన్ చేశారు.