న్యూఢిల్లీ, మార్చి 15: వారం మొదట్లో చేసుకునే శస్త్ర చికిత్సల కంటే, వారం చివర్లో శుక్రవారం శస్త్ర చికిత్స చేసుకునే వారికి అనారోగ్య సమస్యలు, మరణముప్పు అధికంగా ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు కెనడాకు చెందిన కొందరు పరిశోధకులు. సర్జరీ చేసుకున్న రోజు, సమయం రోగుల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్న అంశాన్ని వీరు నిర్ధారించారు.
శస్త్రచికిత్స చేసుకున్న సమయం కీలక పాత్ర పోషిస్తున్నదని, శస్త్రచికిత్స భద్రతను మెరుగుపర్చడానికి షెడ్యూలింగ్ పద్ధతులను పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రాధాన్యతను వివరిస్తున్నదని వీరి ఫలితాలు రుజువు చేశాయి. సర్జరీ తర్వాత రోగులకు 30 రోజులు, 90 రోజులు, ఏడాది తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశాన్ని వైద్యులు పరిశీలించారు.