ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళాలో బోట్లు నడిపే ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబానికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పింటూ మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. మహా కుంభమేళా జరిగిన 45 రోజులు త్రివేణీ సంగమానికి పడవలు నడిపిన ఈ కుటుంబం దాదాపు రూ. 30 కోట్లు సంపాదించింది.
ఐటీ అధికారులు టిప్పూ సంపాదన గురించి తెలుసుకుని ఐటీ చట్టంలోని 4, 68 సెక్షన్ల కింద రూ.12.8 కోట్ల పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో షాక్‌లో ఉన్న పింటూ కుటుంబం అంత డబ్బు ఎక్కడి నుంచి కడుతుందని సెబీ రిసెర్చ్ అనలిస్ట్ ఏకే మంధన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఐటీ శ్లాబ్‌లు, నిబంధనల గురించి ఏమీ తెలియని పింటూ సంపాదించిన సొమ్ములో ఖర్చులు పోను ఇక మిగుల్చుకున్నదేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.