Terrorist | పాకిస్థాన్ (Pakistan) కేంద్రంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబాకు (Lashkar-e-Taiba) చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ (most wanted terrorist) అబు ఖతల్ (Abu Qatal) హతమయ్యాడు. శనివారం రాత్రి పాకిస్థాన్‌లో అతడు హత్యకు గురయ్యాడు.
సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన గార్డుతో కలిసి జీలం ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు 15 నుంచి 20 రౌండ్లు కాల్పులు జరపడంతో అబు ఖతల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు తన భద్రతా గార్డు కూడా ప్రాణాలు కోల్పోగా.. మరో గార్డుకు గాయాలైనట్లు సమాచారం.
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో అబు ఖతల్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న పలు దాడుల్లో ఇతడి హస్తం ఉంది. అంతేకాదు, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయూద్‌కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జూన్ 9న జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలోని శివఖోరి ఆలయం నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై జరిగి ఉగ్రదాడిలో అబు ఖతల్ కీలక పాత్ర పోషించాడు. అతడి నేతృత్వంలో ఈ దాడికి పథక రచన జరిగింది.
Also Read..
Amit Shah | వందేమాతరాన్ని ఆలపించిన ఏడేళ్ల చిన్నారి.. గిటార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన అమిత్ షా
Padma Awards | పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Anasuya | ఆకతాయికి దమ్కీ ఇచ్చిన అనసూయ.. ప్యాంట్ తడిసిపోతుందా అంటూ సైగ