Anasuya | అందాల అనసూయ చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ పర్సన్. యాంకర్ నుండి నటిగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కొందరు దర్శకులు ఆమె కోసమే కథలు రాస్తున్నారంటే అనసూయ క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోచ్చు. ఇక అనసూయ వివాదాలతో కూడా ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో ఢీ అంటే ఢీ అంటూ కొన్నాళ్ల పాటు ఫైట్ చేసింది. ఇదే కాకుండా పలు సందర్భాలలో నెటిజన్స్ తనని ట్రోల్ చేయడంపై కూడా అనసూయ ఫైర్ అయింది. వారికి గట్టిగా బుద్ది చెప్పింది.
ఇక ఇదిలా ఉంటే శుక్రవారం (మార్చి 14) దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఈవెంట్స్‌కి వెళ్లి అభిమానులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఓ హోలీ ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడ ఓ ఆకతాయి అనసూయను ఆంటీ అని పిలిచాడు. అంతే.. ఆ మాట విన్న అనసూయకు చిర్రెత్తిపోయింది. అందరి ముందే ఆ ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. దమ్ముంటే స్టేజీపైకి రా ..నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా రా అంటూ ధమ్కీ ఇచ్చంది. అయితే అతడు రాకపోవడంతో ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది.
అనసూయ చేసిన ఈ సైగలకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది నెటిజన్స్ కొందరు ఏంటి.. అనసూయకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయిన తనకు ఆంటీ అని పిలవడం నచ్చదని తెలిసి కూడా ఎందుకు పిలుస్తున్నారు అంటూ హితబోధ చేస్తున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ హరిహర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించి సందడి చేయనుంది.
దమ్ముంటే స్టేజ్ మీదకు “రారా”..
టాలివుడ్ నటి అనసూయ!#Tollywood #Celebrity #Anasuya #UANow #Culture pic.twitter.com/Q2FgbUhkFn
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 15, 2025