Kanimozhi | పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు భారతీయ ఎంపీలు వివరిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని ఎంపీ బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) నేతృత్వంలోని అఖిపలక్ష దౌత్య బృందం స్పెయిన్ (Spain)లో ఉన్నది. ఈ సందర్భంగా మాడ్రిడ్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో ఎంపీ కనిమొళికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
భారతదేశ జాతీయ భాష (Indias national language) ఏంటి..? అని ఎంపీ కనిమొళిని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ భారతదేశ జాతీయ భాష ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటూ సమాధానమిచ్చారు. ‘భారతదేశ జాతీయ భాష భిన్నత్వం, ఏకత్వం. ఇదే మా ప్రతినిధి బృందం ప్రపంచానికి ఇచ్చే సందేశం. నేడు ఇదే అత్యంత ముఖ్యమైన విషయం’ అంటూ మాడ్రిడ్‌లోని భారతీయ సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇటీవల భాషా పరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ కనిమొళి సమాధానం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు మాడ్రిడ్‌లో మీడియాతో కనిమొళి మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు, మిగితా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు ఆమె చెప్పారు. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులను ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ తేడాను ప్రపంచ దేశాలకు వివరిస్తున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఉగ్రవాద స్పాన్సర్ దేశాల గురించి వివరిస్తున్నట్లు చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకున్న దేశాలు.. ఇండియాకు మద్దతు ఇస్తున్నాయని, ఎందుకంటే ఉగ్రవాదం హద్దులు దాటుతోందని ఆయా ఆదేశాలు అంగీకరిస్తున్నట్లు ఎంపీ కనిమొళి చెప్పారు.
Also Read..
DMK MP Kanimozhi: ఆ తేడాను వివరిస్తున్నాం: ఎంపీ కనిమొళి
corona virus | దేశంలో 4 వేలు దాటిన కరోనా కేసులు.. 37 మంది మృతి
Spying | పాక్ కోసం గూఢచర్యం.. పంజాబ్ వ్యక్తి అరెస్ట్