బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు| కరోనా రెండో వేవ్ నేపథ్యంలో భారతీయ సంపన్నులు, నిపుణులు మెరుగైన జీవనం ప్లస్ ఆరోగ్య వసతుల కోసం బ్రిటన్ వంటి విదేశాల....

న్యూఢిల్లీ: మెరుగైన హెల్త్ కేర్ సర్వీసులు, బెటర్ లైఫ్ స్టెయిల్ కోసం భారతీయ సంపన్నులు, కార్పొరేట్ సంస్థల అధినేతలు, నిపుణులు విదేశాల వైపు ప్రత్యేకించి బ్రిటన్ వైపు చూస్తున్నారు. దేశీయంగా కరోనా రెండో వేవ్ ఉధ్రుతంగా సాగుతున్న వేళ.. ఆక్సిజన్ లేక.. బెడ్లు దొరకక రోగులు ఇక్కట్ల పాలవుతున్న నేపథ్యంలో దేశీయంగా వైద్య సేవల పట్ల పెదవి విరుస్తున్నారు. కరోనా వైరస్ సోకితే మెరుగైన ఆరోగ్య వసతుల కోసం దేశం విడిచి వెళ్లేందుకు… సరైన వసతుల గల దేశం గురించి సమాచారం కావాలంటూ సంపన్నులు, నిపుణులు ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లను సంప్రదించడం పెరిగిపోయింది.
బ్రిటన్‌తోపాటు కెనడా, సైప్రస్, మాల్టా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలు భారతీయ సంపన్నులు, ప్రముఖులు, నిపుణులకు అత్యంత సానుకూల కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. అంతే కాదు.. అత్యంత సంపన్నులు తమ బిజినెస్‌లను విదేశాల్లో స్థాపించి కొనసాగించేందుకు చర్యలు చేపటుడుతున్నారు. జర్మనీ, స్పెయిన్, పోలండ్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
హెల్త్‌కేర్, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటున్న సూపర్ రిచ్ ఇండియన్లు.. భారత్ ఆవల సెటిల్ కావడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగిన తర్వాత వివిధ దేశాల ఇన్వెస్టర్లు, నిపుణులైన వర్కర్లకు బ్రిటన్‌లో అవకాశాలున్నాయి.
ప్రత్యేకమైన వీసాపై బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లు, స్కిల్డ్ వర్క్ వీసా అందుకున్న వారికి వర్తిస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లే వారి కోసం ఇమ్మిగ్రేషన్ ప్ర్రక్రియ సుమారు 40 శాతం పెరిగిందని న్యాయవాదులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక ప్రకారం 2020 నాటికి భారత్ ఆవల 1.8 కోట్ల మంది ఇండియన్లు జీవిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారతీయులే అత్యధికంగా స్వంత దేశం అవతల జీవిస్తున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 35 లక్షల మంది, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్థాన్, ఖతర్, బ్రిటన్లలో కూడా భారీ సంఖ్యలోనే ఇండియన్లు నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు
అనిల్‌కి షాక్ భారత్‌కు స్విస్ వివరాలు
కెయిర్న్ చేతికి ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తులు?
ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్‌వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్‌ఫోన్ వచ్చింది!
ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
గుంటూర్ జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త
లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి రూ 28 లక్షల జరిమానా వసూలు!
హెచ్-4 వీసాదారులకు గూగుల్ మద్దతు
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ
13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చరిత్రలో ఈరోజు
ఒడిశాలో షూటింగ్‌లపై నిషేధం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

