న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డాం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలో వ్యాక్సిన్లు తయారు చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారని ప్రశంసించారు.
మన శాస్త్రవేత్తలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ఇంత జనాభా గల దేశంలో వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే మన పరిస్థితి ఏమిటని ప్రశంసించారు.
కేంద్రం తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాల వల్లే దేశంలో కరోనాను నియంత్రించడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని మోదీ చెప్పారు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలకు, క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి కేంద్రం మద్దతు తెలిపిందన్నారు.
వ్యాక్సిన్ల తయారీలో గతంలో మాదిరిగా చేస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 40 ఏండ్లు పట్టేదని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్లో ఏ దేశంతోనూ వెనుకబడి లేమని, దేశం స్వయం సమ్రుద్ధిగా మారిందన్నారు.
ప్రస్తుతం దేశంలో ఏడు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయని తెలిపారు. మరో మూడు కంపెనీలు తాము తయారు చేసిన వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయన్నారు.
చిన్నారులకు టీకా తయారు చేయడానికి భారీగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. మరోవైపు నాసల్ స్ప్రే వ్యాక్సిన్ కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశీయ అవసరాలకు అనుగుణంగా త్వరలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగవంతం అవుతుందని చెప్పారు. పేదలు, చిన్నారులకు అన్ని రకాల టీకాలు 90 శాతం వేయగలిగామన్నారు. ఇప్పటి వరకు 23 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్‌లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్