Jagtial | వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. టిఫిన్ చేస్తూ గుండెపోటుతో మృతి..!
Jagtial : జగిత్యాలలో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చక్రవర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
Jagtial : జగిత్యాలలో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఛాతినొప్పితో క్రిటికల్ కేర్ ఆస్పత్రికి వెళ్లిన కరీంనగర్‌కు చెందిన చక్రవర్తి(38)కి వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహించారు. ఈసీజీ నార్మల్‌గా రావడంతో అతడిని ఇంటికి వెళ్లాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈసీజీ అనంతరం ఆస్పత్రి నుంచి కొంత దూరం వెళ్లి.. ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తుండగా చక్రవర్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో కుప్పకూలిన చక్రవర్తిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
చక్రవర్తి హఠాన్మరనంతో మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చక్రవర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చాతి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన సమయంలోనే చేర్చుకుని.. చికిత్స అందించి ఉంటే అతడు ప్రాణాలతో ఉండేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైద్యులు స్పందించాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

