INDW vs THAW | థాయ్‌లాండ్‌పై షఫాలీ మెరుపులు.. ఆలౌట్ తప్పించుకున్న భారత్..!
INDW vs THAW : మహిళల ఆసియాకప్ తొలి పోరులో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. పసికూన థాయ్‌లాండ్ బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ షఫాలీ వర్మ(64) అర్ధ శతకంతో చెలరేగగా.. టీ20ల్లో అరంగేట్రం ప్రతీకా రావల్(22) మెరిసింది.
INDW vs THAW : మహిళల ఆసియాకప్ తొలి పోరులో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. పసికూన థాయ్‌లాండ్(Thailand) బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ షఫాలీ వర్మ(64) అర్ధ శతకంతో చెలరేగగా.. టీ20ల్లో అరంగేట్రం ప్రతీకా రావల్(22) మెరిసింది. అయితే.. థాయ్ బౌలర్లు మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. దాంతో.. టీమిండియా ఆలౌట్ అంచున నిలిచింది. అయితే.. క్రాంతి గౌడ్(15 నాటౌట్), శ్రీ చరణి(6 నాటౌట్)లు చివరి దాకా నిలబడి పరువు కాపాడారు. ఫలితంగా ప్రత్యర్థికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది హర్మన్‌ప్రీత్ సేన.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియాకప్ తొలి పోరులో భారత జట్టును థాయ్‌లాండ్ బౌలర్లు భయపెట్టారు. టాస్ ఓడి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన థాయ్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టారు. ఓపెనర్లు స్మృతి మంధాన(19), షఫాలీ వర్మ(64)లు దూకుడుగా ఆడి శుభారంభమిచ్చారు. అయితే.. సువాన్చొనారతి మెరుపు త్రోకు మంధాన వెనుదిరిగింది. 34వ తొలి వికెట్ పడగా అరంగేట్రం ప్లేయర్ ప్రతికా రావల్(22) జతగా షఫాలీ చెలరేగింది.
Two wickets in two balls for Thailand!
Shafali Verma and Richa Ghosh 0(1) depart#AsiaCup2026, Follow INDvsTHA live: https://t.co/yex7cyDVJ9 pic.twitter.com/Q2Hx5z6l8H
— Cricinfo (@cricinfo) August 30, 2026
ప్రత్యర్థి బౌలర్లకు దడపుట్టిస్తూ 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది. ప్రతీక కూడా బ్యాట్ ఝులిపించగా స్కోర్ పరుగులు తీసింది. స్వల్ప వ్యవధిలోనే ఇద్దరిని ఔట్ చేసిన సులీపొర్న్ లవోమి(3-26) థాయ్‌కు బ్రేకిచ్చింది. అనంతరం మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవకపోవడంతో భారత స్కోర్ వేగం తగ్గింది. ఆఖర్లో క్రాంతి గౌడ్(15 నాటౌట్), శ్రీ చరణి(6 నాటౌట్)లు పోరాడడంతో థాయ్ ముందు 160 పరగుల లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా.
India weather a few wobbles to set Thailand a target of 160 in their #AsiaCup2026 opener
Suleeporn Laomi’s Thailand’s standout bowler with three wickets ✨
Follow INDvsTHA live: https://t.co/yex7cyDVJ9 pic.twitter.com/haiKSaa49k
— Cricinfo (@cricinfo) August 30, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

