భువనేశ్వర్: భార్య, పిల్లలతో విడిపోయి, వారికి భరణం చెల్లించడంలో విఫలమైన రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి ఆ మొత్తాన్ని మినహాయించాలని ఒడిశా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించే ఈ ఉత్తర్వు బాధిత లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చినదని అధికారులు తెలిపారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ఆదేశించిన భరణం, జీవన భృతి చెల్లింపులను కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశించారు. జీతాల నుంచి నేరుగా మినహాయించి, సంబంధిత విడిపోయిన భార్య లేదా పిల్లల ఖాతాకు బదిలీ చేస్తారు’ అని మాఝీ కార్యాలయం తెలిపింది.