Kasi Vishwanath : మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో శివయ్యను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భక్తుల శివ నామ స్మరణలతో దేశంలోని ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.
ఇక దేశంలోని ప్రధాన శైవ క్షేత్రమైన కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం శివరాత్రి శోభతో అలరారుతోంది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో కిలోమీటర్ల మేర భక్తులు ఆ పరమశివుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా సౌకర్యాలు కల్పించింది.
శివయ్య దర్శనం కోసం బారులు తీరిన భక్తులపై అధికారులు హెలికాప్టర్ ద్వారా పూలు చల్లించారు. ఆలయంలోపల ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ, అర్చకుల వేదమంత్రోఛ్చరణలతో కాశీ క్షేత్రం పరిసరాలు మార్మోగుతున్నాయి. కాశీ విశ్వానాథుడి ఆలయం అధికారులు హెలికాప్టర్ ద్వారా పూలు చల్లిన దృశ్యాలను కింది వీడియోలో మీరు చూడవచ్చు..
#WATCH | Uttar Pradesh | Flower petals being showered on devotees who have arrived at Kashi Vishwanath Temple to offer prayers on the occasion of Maha Shivratri. pic.twitter.com/S4Lb7unPB7
— ANI (@ANI) February 26, 2025
Wild Animals | వైల్డ్ వార్.. దేశంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ
KTR | కాంగ్రెస్ పతనం ప్రారంభం.. 15 నెలలకే రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి: కేటీఆర్
Lord Shiva | నేలపై పడుకున్నట్టుగా ఉండే శివలింగం.. అక్బర్‌కు ఆ ఆలయానికి ఉన్న సంబంధమేంటి?