By-election : గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని విసవదార్ (Visavadar) అసెంబ్లీ నియోజకవర్గం (Assembly constituency) లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ముందంజలో ఉన్నారు. ఇటీవల ఇతర నియోజకవర్గాలతోపాటు విసవదార్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఓట్లు లెక్కిస్తున్నారు. 17 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి ఆప్ అభ్యర్థి లీడింగ్‌లోకి వచ్చారు.
ముందు నుంచీ ఆధిక్యంలో ఉన్న గోపాల్ ఇటాలియా ఆ తర్వాత కొన్ని రౌండ్లలో వెనుకబడి పోయారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆప్ అభ్యర్థి ఆధిక్యంలో వచ్చారు. ప్రస్తుతం ఆప్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై 14,404 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రన్పారియా మూడో స్థానంలో ఉన్నారు.