Harassing Woman | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో పోకిరీల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రాజధాని లక్నో (Lucknow)లో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళపై అల్లరిమూక వేధింపులకు (Harassing Woman) తెగబడింది. భారీ వర్షాల కారణంగా వరద నీటితో నిండిన రోడ్డు (Flooded Road)పై బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
ఓ మహిళ స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపు నీటిలోంచి ఒక వ్యక్తితో కలిసి బైక్‌పై వెనుక కూర్చొని వెళ్తోంది. అప్పటికే నీళ్లలో దిగి వెకిలి చేష్టలు చేస్తున్న దాదాపు 15 మంది యువకులు.. మహిళను చూసి వర్షపు నీళ్లు చల్లడం మొదలు పెట్టారు. ఆమెను వేధిస్తూ వికృతానందం పొందారు. అనంతరం ఆమెను ఒక్కసారిగా నీటిలోకి పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అల్లరి మూకను చెదరగొట్టారు. అనంతరం ఆ మహిళను అక్కడి నుంచి పంపించేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Lucknow: A viral video shows people mistreating a woman during rain and causing a ruckus under the Taj Hotel bridge. Police intervened, dispersed the crowd, and are identifying those involved pic.twitter.com/7TJxUYKmIv
— IANS (@ians_india) July 31, 2024
Also Read..
Himachal Cloudburst | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. పలువురు గల్లంతు..!
KTR | సిగ్గుచేటు.. సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
BRS | మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం