Himachal Cloudburst | హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు 35 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా మండిలోని విద్యాసంస్థలను మూసివేస్తూ డీసీ ఉత్తర్వులు జారీ చేశారు. మండి తాల్తుఖోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి పలుచోట్ల ఇండ్లు కూలినట్లు సమాచారం. రహదారులు దెబ్బతిన్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు.
తేరాంగ్, రాజ్‌బాన్ గ్రామాల్లో మేఘాలు సంభవించినట్లు తాల్తుఖోడ్ పంచాయతీ ప్రధాన్ కాలీ రామ్ పేర్కొన్నారు. ఈ పాధార్ సబ్ డివిజన్లోని తాల్తుఖోడ్‌లో వర్షాలకు తొమ్మిది మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. మరో 35 మంది సురక్షితంగా బయటపడినట్లు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్ సహాయం కోరింది. సిమ్లా-కులు సరిహద్దులోనూ వర్షం విధ్వంసం సృష్టించింది. పలువురు గల్లంతైనట్లు తెలుస్తున్నది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యలు ప్రారంభించాయి. సమాచారం ప్రకారం.. కులులోని నిర్మాంద్ ప్రాంతంలో 19 మంది గల్లంతైనట్లు సమాచారం. చాలా చోట్ల రోడ్లు తెగిపోయినట్లు సమాచారం. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు.
ఇందులో అంబులెన్స్‌లతో సహా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. కులు జిల్లాలోని కురుస్తున్న భారీ వర్షాలతో రెండు పవర్ ప్రాజెక్టులకు భారీ నష్టం కలిగింది. భారీ వరదలతో పార్వతి నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జియా, భుంతర్తో పాటు నది ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాగీపూల్లో ఏడు నుంచి పది మంది గల్లంతైనట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గల్లంతైనట్లు తెలుస్తున్నట్లు సమాచారం. బాధితులను కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నిర్మంద్లో చాలా చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. బాగీపూల్లోని బస్టాండ్ పూర్తిగా మాయమైంది. 15 వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.