న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్షనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వయనాడులో పర్యటించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీతో (Priyanka Gandhi) కలిసి ఢిల్లీ నుంచి వరద బాధిత వయనాడుకు ఆయన బయల్దేరారు. కొండచరియలు విరిగిపడి ఘటన, వరద బాధితులను పరామర్శించనున్నారు. కాగా, బుధవారమే ఇరువు నేతలు వయనాడ్‌లో పర్యటించాల్సి ఉన్నది. అయితే ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పర్యటనను వాయిదావేసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా రాహుల్ వెల్లడించారు. త్వరలో అక్కడికి వెళ్తామన్నారు.
ప్రకృతి ప్రకోపానికి వయనాడ్ మరుభూమిగా మారిపోయింది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. చలియార్ నదిలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. వందలాది ఇండ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు. కొండచరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయిన ఇండ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఆర్మి, సహాయక బృందాలు వెలికితీస్తున్నారు. ఇప్పటికీ వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ దొరకడం లేదు.
270కి చేరిన మృతుల సంఖ్య
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 270 మృతదేహాలు లభ్యమయ్యాయి. చలియార్ నదిలో కొట్టుకువచ్చిన 83 మృతదేహాలను బయటకు తీశారు. 166 మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ పూర్తికాగా, 32 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఇప్పటికీ అధికారికంగా 200 మంది ఆచూకీ దొరకడం లేదు. 191 మంది తీవ్ర గాయాలతో వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం 45 సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి 3,069 మందిని తరలించింది. ఇప్పటికే విరిగిపడ్డ కొండచరియలను చాలావరకు తొలగించలేదు. అనేక ఇండ్లలోకి సహాయక సిబ్బంది చేరుకోలేదు. దాదాపు 500 ఇండ్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో, మృతులు, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.
నాలుగు దశాబ్దాల్లో రెండు ఘటనలు
ముండక్కైలో గతంలోనూ కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు జరిగాయి. 1984 జూలై 1న పెద్దఎత్తున ఈ పట్టణంపై కొండచరియలు విరుచుకుపడగా 14 మంది మరణించారు. అప్పుడు కూడా పలువురి మృతదేహాలు చలియార్ నదిలో లభ్యమయ్యాయి. 2019 ఆగస్టు 8న భారీ వర్షాలు కురవడంతో మరోసారి కొండచరియలు పట్టణంపై విరుచుకుపడగా 22 మంది మరణించారు.
#WATCH | Congress leader & Lok Sabha LoP Rahul Gandhi along with Congress leader Priyanka Gandhi Vadra arrives at Delhi airport, they’ll shortly leave for Wayanad, Kerala.
Bothe the Congress leaders will visit Wayanad to take stock of the situation of the constituency which has… pic.twitter.com/7u3wLfSb21
— ANI (@ANI) August 1, 2024
కాగా, జులై 30 ఉదయం నుంచి కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని రెస్క్యూ ఆపరేషన్స్ చీఫ్ మేజర్‌జనరల్ మ్యాథ్యూ అన్నారు. ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మరిన్ని మృతదేహాలను లెక్కించాల్సి ఉందన్ని చెప్పారు. చాలా మందిని రక్షించామని వెల్లడించారు. ఇక బురదలో కూరుకుపోయిన ఇండ్లలో వెతకాల్సి ఉందన్నారు. దీనికోసం తమకు భారీ పరికరాలు అవసరమవుతాయని తెలిపారు. ప్రస్తుతం గాలింపు కొనసాగుతున్నదని, డాగ్ స్క్వాడ్‌తోపాటు 5 వందలకుపైగా ఆర్మీ సిబ్బంది ఇందులో పాలుపంచుకుంటున్నారని వెల్లడించారు.
#WATCH | Wayanad landslide | On search and rescue operations, Major General Mathew says, ” …We are here supporting the Kerala govt and people since 30th July morning. We have recovered 100+ bodies and overall body count is much more. We have also rescued so many people…almost… pic.twitter.com/yDRMAKVOSs
— ANI (@ANI) August 1, 2024
#WATCH | Wayanad landslide | On search and rescue operations, Major General Mathew says, ” …We are here supporting the Kerala govt and people since 30th July morning. We have recovered 100+ bodies and overall body count is much more. We have also rescued so many people…almost… pic.twitter.com/yDRMAKVOSs
— ANI (@ANI) August 1, 2024