న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 11.25 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది. ఘాజీపూర్‌లో చిన్నారి సహా ఓ 22 ఏండ్ల మహిళ కాలువలో మునిగి చనిపోయింది.
భారీ వానలతో నగరంలోని పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారిమళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో స్కూళ్లు, విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు రెడ్ అలర్డ్ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజల బయటకు రాకూడదని సూచించింది. బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 7.15 గంటల వరకు మయూర్ విహార్‌లోని సల్వాన్ స్కూల్ వద్ద అత్యధికంగా 147.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపింది. నోయిడాలో 147.5 మి.మీ., గురుగావ్‌లో 119.5 మి.మీ., నజఫ్గఢ్లో 113 మి.మీ., లోధీ రోడ్లో 107.5 మి.మీ., ఢిల్లీ యూనివర్సిటీ వద్ద 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది పేర్కొంది. కాగా, రాజేందర్‌నగర్ మరోసారి నీటమునిగింది. వరద నీటిలోనే సివిల్స్ అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించారు. ఓల్డ్ రాజేందర్‌నగర్‌లోని రావూస్ ఐఏఎస్ అకాడమీలోని సెల్లార్ నీటమునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే.
Salwan Station Mayur Vihar in East Delhi observed 147.5 mm rainfall from 8:30 AM July 31 to 7:15 AM today whereas station NCMRWF, Noida Sector 62 in Gautam Buddha Nagar, UP observed 147.5 mm rainfall: IMD#DelhiRains pic.twitter.com/ng0hPFzzRT
— ANI (@ANI) August 1, 2024
#WATCH | Delhi: Waterlogging witnessed in several parts of the national capital after heavy rainfall; visuals from outside Civic Center near Ramlila Maidan. pic.twitter.com/19UhRO02ag
— ANI (@ANI) July 31, 2024
#WATCH | A 22-year-old woman and her child died after drowning in a waterlogged drain in the Ghazipur area. Further legal action is being taken by Police Station Ghazipur East Delhi: Delhi Police https://t.co/fWXzuwv6rJ pic.twitter.com/fy3GMXY3z3
— ANI (@ANI) August 1, 2024