Air Pollution | ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి (Air Pollution) చేరింది. గాలి నాణ్యత సూచిక (AQI) అధ్వానస్థాయిలో నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 400కుపైనే నమోదవుతున్నాయి. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు, శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నగర వాసులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ వాహనాలు సమీపంలోని హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్‌కు క్యూ కట్టాయి. రోహ్తాంగ్ పాస్ (Rohtang Pass) సమీపంలో వాహనాల రద్దీ కనిపించింది. వందలాది కార్లు (Hundreds Of Cars) రోహ్తాంగ్ రహదారిపై నిలిచిపోయిన దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో వాహనాలు ముందుకు కదలకుండా రోడ్డుపై నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది.
‘విషపూరిత గాలి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వాసులు నగరాన్ని వీడి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు’, ‘కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి కాకపోతే మరేంటి..? ఇది ఏ నగరంలోని రోడ్డు కాదు. ఇది రోహ్తాంగ్ పాస్. అక్కడ ప్రస్తుతం ఎలాంటి స్నో లేదు. హాలిడేస్ లేవు. అయినా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందరూ ఎందుకు ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు..?’ అంటూ ఈ వీడియోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
Escape from toxic AQI or what ? 😅
This jam isn’t on some city road, it’s Rohtang Pass. No snowfall yet. No vacations. Still such massive traffic. So what exactly is pulling everyone up there? pic.twitter.com/cc21YIujVP— Nikhil saini (@iNikhilsaini) December 16, 2025
Also Read..
Bharat Taxi | ఓలా, ఉబర్‌కు పోటీగా.. భారత్ ట్యాక్సీ వచ్చేస్తోంది
PM Modi | సొంతింట్లో ఉన్న భావన కలుగుతోంది.. ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ
Vande Mataram | వందేమాతరం ఆలపించిన ఇథియోపియన్ గాయకులు.. పులకరించిపోయిన ప్రధాని మోదీ