Bharat Taxi | ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో (Bharat Taxi) వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో జనవరి 1వ తేదీ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ యాప్ సేవలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు.
ఇందులో ఆటో, క్యాబ్, బైక్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తైనట్లు వెల్లడించింది. ఈ భారత్ ట్యాక్సీ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్న క్యాబ్ ఛార్జీల (Cab Charges) నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు.
Also Read..
PM Modi | సొంతింట్లో ఉన్న భావన కలుగుతోంది.. ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ
Vande Mataram | వందేమాతరం ఆలపించిన ఇథియోపియన్ గాయకులు.. పులకరించిపోయిన ప్రధాని మోదీ
Bomb Threats | పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్