Bomb Threats | గుజరాత్ (Gujarat)లో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. అహ్మదాబాద్ (Ahmedabad)లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.
నగరంలోని మహారాజా అగ్రసేన్ స్కూల్, వేజల్పూర్ జైడస్ స్కూల్, నిర్మాణ్ స్కూల్, డివైన్ స్కూల్, ఆవిష్కర్ స్కూల్, కలోల్ దేవ్ ఇంటర్నేషనల్ సహా ప్రముఖ పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల ఆవరణలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు. అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాఠశాలల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపి క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు బెదిరింపు మెయిల్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gujarat | Three schools in Ahmedabad received bomb threats via email today. Police teams are at the respective schools: Sharad Singhal, Joint Police Commissioner, Ahmedabad Crime Branch.
— ANI (@ANI) December 17, 2025
Also Read..
Anant Ambani | మెస్సికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్నికోట్లంటే..?
Lionel Messi | నమస్తే ఇండియా.. ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు : మెస్సి