Rashtrapati Bhavan | ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనుకోని అతిథి కదలికలు.. అది చిరుతపులేనా..?
Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆహ్వానం లేని (uninvited guest), అనుకోని అతిథి ఒకరు కెమెరా కంటికి చిక్కారు.
Rashtrapati Bhavan | కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశాధినేతలు, పారిశ్రామిక వేత్తలు, సినీ తారలు సహా సుమారుగా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో ఆహ్వానం లేని (uninvited guest), అనుకోని అతిథి ఒకరు కెమెరా కంటికి చిక్కారు.
కార్యక్రమం జరుగుతున్న స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో ఓ జంతువు కదలికలు కనిపించాయి. బీజేపీ ఎంపీ దుర్గా దాస్ (MP Durga Das) కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రికార్డుల్లో సంతకం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో అడవి జంతువు కదలికలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు అది చిరుతపులినా (Leopard)..? లేక పెంపుడు జంతువా..? ఇంకేదైనానా..? అంటూ చర్చించుకుంటున్నారు. కొందరేమో ‘అక్కడున్నది పులే..’ అని, మరికొందరేమో ‘శరీర ఆకృతి, నడక చూస్తుంటే అది నిజంగా చిరుతపులే అనిపిస్తోంది..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమందేమో ‘ఇది పెంపుడు జంతువు కావొచ్చు..’ అని అంటున్నారు. అయితే, ఈ వీడియో నిజమైంది కాదని, ఎడిట్ చేసిందై ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. మరి నిజమేంటో తెలియాలంటే.. రాష్ట్రపతి భవన్ అధికారులు స్పందించాల్సిందే. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork
~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024
Also Read..
Bye Elections | 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
Indian origin | కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య
Chandra Sekhar Pemmasani: మోదీ సర్కారులో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

