Indian origin | కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య
Indian origin | కెనడా (Canada)లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Indian origin | విదేశాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన (Indian origin) వ్యక్తుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది భారత్‌కు చెందిన వ్యక్తులు అక్కడ ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. తాజాగా కెనడా (Canada)లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 7న సుర్రే (Surrey) ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా.. అప్పటికే యువరాజ్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుర్రే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
యువరాజ్ గోయల్ స్వస్థలం పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని లూథియానా (Ludhiana). 2019లో స్టూడెంట్ వీసాపై కెనడా వెళ్లాడు. అతడు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సుర్రే ప్రాంతంలో కార్ డీలర్‌షిప్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. ఇటీవలే అతడికి కెనడియన్ శాశ్వత నివాసార్హత అనుమతి వచ్చింది. యువరాజ్ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Chandra Sekhar Pemmasani: మోదీ సర్కారులో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా?
Bye Elections | 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
Cabinet Meeting | పీఎం ఆవాస్ యోజన సాయం 50 శాతం పెంపు.. అదనంగా 2 కోట్ల గృహాలు..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

