PM Modi | రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని (Numbers Game Goes On) మోదీ 2.0లోని చివరి మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. దాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం (Victory And Defeat Part Of Politics). నంబర్స్ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్ సహా కూటమి నేతలు హాజరై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఇక ఇప్పటికే పీఎం పదవికి మోదీ రాజీనామా కూడా చేశారు. ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా, మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీ ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదం ఫలించలేదు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేవలం 292 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా 234 సీట్లను కైవసం చేసుకుంది.
Also Read..
Priyanka Gandhi | ఎన్ని అవమానాలు ఎదురైనా దృఢంగా నిలబడ్డావ్.. రాహుల్‌పై ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
PM Modi | ఈ నెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం
Bomb Threat | ఢిల్లీ – టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు