పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపైన, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపైన స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వగానే అత్తాకొడల్లు తట్టాబుట్టా సర్దుకొని అమెరికాకు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. సిటిజన్‌షిప్ లేని ఝాన్సీ రెడ్డి అధిష్టానాన్ని మోసంచేసి వైస్ ప్రెసిడెంట్ పదవిని తీసుకున్నారని విమర్శించారు. ఝాన్సీ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.