PM Modi | సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. దీంతో కేంద్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని సమాచారం.
ఈనెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం (third consecutive term) చేయనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం ఉండనున్నట్లు పేర్కొన్నాయి. ఇవాళ సాయంత్రం ఎన్డీఏ కూటమి సమావేశం అనంతరం నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిసింది.
మరోవైపు ఇవాళ ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులతో మోదీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి వర్గం రద్దు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇక ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పనున్నారు. జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన రెండో నేతగా రికార్డు సృష్టించనున్నారు.
Also Read..
Chandrababu | ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
Ram Charan | కూటమి విజయం.. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
Phone tapping | వైసీపీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు