Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన కూటమి విజయంపై టాలీవుడ్ అగ్రనటుడు రామ్ చరణ్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ రామ్ చరణ్ రాసుకోచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.
Congratulations to the visionary @ncbn Garu on the astounding victory!
— Ram Charan (@AlwaysRamCharan) June 5, 2024